పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 30
పలమనేరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పలువురు మైనారిటీ నాయకులు, యువత పార్టీలో చేరారు. జెండామఠం ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు బీడీ మస్తాన్‌తో పాటు ఆయన అనుచరులు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సమక్షంలో గురువారం టీడీపీ కండువాలు కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పలు వార్డుల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఈ చేరికలు జరిగాయి. బీడీ మస్తాన్‌తో పాటు జమీర్, అజగర్, అల్తాఫ్, దావూద్, తబరేజ్, అల్లాబక్ష్, చాంద్ బాషా, ముబారక్, షఫీ, జోహార్, రవి తదితరులు టీడీపీలో చేరారు. అదేవిధంగా 14వ వార్డు మసీదు వీధికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు కూడా ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.130 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాల్లో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments