
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 26:
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 25వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో బెటప్ప నాయుడు, విభూషణం, సురేష్ బాబు,సురేష్,వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు చేసి, ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది. వేడుకల్లో సామాజిక వర్గ సభ్యులు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొని జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంతో 25వ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది.


Recent Comments