
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 27:
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 18వ వార్డులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ మోనిషా మునుస్వామి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో బరిలో ఉన్న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎస్. రాజ్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లిన మోనిషా మునుస్వామి.. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఎస్. రాజ్‌కుమార్ విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కుమార్, న్యాయవాది శ్రీకాంత్, 18వ వార్డు ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, మాజీ గంగమ్మ గుడి డైరెక్టర్ దేవేంద్ర, మైనారిటీ నాయకులు షకీర్, మజార్, నాసిర్, రియాజ్, ఇస్మాయిల్, వెంకటేష్, సుభాష్, సలీం, ఖదీర్, శ్రీనివాసులు, సత్యరాజ్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments