EPAPER
Tuesday, November 3, 2026
Google search engine

లండన్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా సంబరాలు

📰 Generate e-Paper Clip

చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 28:

 

విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ యూకేలోని క్రొయ్దన్ ప్రాంతంలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో రిడిల్స్‌డౌన్ కాలేజియేట్‌లో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని పండుగ సంబరాల్లో మునిగిపోయాయి. సంప్రదాయ పట్టుచీరలు, వోణీలతో మహిళలు, యువతులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ రకాల రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ప్రాంగణానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. బతుకమ్మల చుట్టూ చేరిన మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో కార్యక్రమ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వేడుకలకు హాజరైన తెలుగు కుటుంబాలకు సంప్రదాయ తెలుగు వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 2026 సీటీఏ కమిటీ సభ్యులు సాయి ప్రకాశ్‌, వెంకట్‌, ప్రవీణ్‌, మట్టారెడ్డి, చిరంజీవి, శాంతితో పాటు పలువురు వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి వేడుకలు విజయవంతం కావడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమానికి కేపీ గ్రూప్స్‌, మాక్స్ వెల్త్ ఫైనాన్షియల్‌, అన్నపూర్ణ రైస్‌, సుక్రోజ్ కన్‌స్ట్రక్షన్‌, ఆభరణ సిల్క్స్‌, క్రిస్పీ దోస, గ్రీన్ ఆపిల్‌, వ్రిష్కర్ బ్లైండ్స్‌ తదితర సంస్థలు స్పాన్సర్లుగా సహకరించాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఇలాంటి వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. బతుకమ్మ, దసరా పండుగల ద్వారా తెలుగు సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ, ప్రవాస తెలుగువారిలో ఐక్యతను పెంపొందించేలా ఈ సంబరాలు సాగాయి.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!