
రామకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు06:
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు, ప్రియా నర్సింగ్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుధీర్ వ్యక్తిగత కార్యదర్శి రాము రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థాని కంగా విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాము కుప్పంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గురువారం రామకుప్పం మండలం బల్ల గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరైన డాక్టర్ సుధీర్ రాము పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాము కుటుంబానికి తక్షణ సాయంగా రూ.1లక్ష నగదు అందజేసిన డాక్టర్ సుధీర్, రాము పిల్లల చదువులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని, వారి భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాము మృతి పట్ల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డప్ప, రామకుప్పం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాబు రెడ్డి చరవాణి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాము మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సన్నిహితులు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, గ్రామస్తులు హాజరై రాముకు కన్నీటి వీడ్కోలు పలికారు.


Recent Comments