
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు06:
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న “డోర్ టు డోర్” కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు శాంతిపురం మండలంలోని కొలమడుగు, శివరాంపురం, దొడ్డి కాలనీ, డొంకుమానిపల్లి, తులసికొత్తూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టే నాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే ఉందని అన్నారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్. ఉదయ్ కుమార్, పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments