EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

డ్రోన్ వ్యవసాయంపై రైతులకు అవగాహన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రదర్శన ఎ.ఎం.సి చైర్మన్ జి.ఎం.రాజు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 06:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని వసనాడు గ్రామంలో గురువారం నిర్వహించిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో రైతులకు డ్రోన్ ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో క్రిమిసంహారక మందుల డ్రోన్ పిచికారీని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. డ్రోన్ సాంకేతికతతో తక్కువ మందు, తక్కువ నీటితో తక్కువ సమయంలోనే పిచికారీ చేయవచ్చని అధికారులు వివరించారు. దీంతో శ్రమ, వ్యయం తగ్గడంతో పాటు పంటకు సమానంగా మందు చేరి దిగుబడి పెరిగే అవకాశముందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని లాభదాయక మైన సాగు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.ఎం.రాజు,వైస్ చైర్మన్ శరవణ, క్లస్టర్ ఇన్‌చార్జిలు,వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!