EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

📰 Generate e-Paper Clip

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:

 

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం నల్ల వెంగనపల్లి పంచాయతీ పరిధిలోని కేవీఎం అగ్రహారం గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ పాల్గొని అర్హులైన రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు భూ హక్కుల రక్షణతో పాటు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి హక్కులను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాబు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోహన మురళి,స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!