EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

రేణిగుంట నూతన తాహసిల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన  టీడీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:

 

రేణిగుంటమండల నూతన తాహసిల్దార్‌ గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ ని మంగళవారం స్థానిక తెలుగు దేశం పార్టీ (టీడీపీ)నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ కార్యాలయంలో ఆయనకు శాలువా కప్పి,దుశ్శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించాలని ఈ సందర్భంగా నాయకు లు కోరారు. ఇందుకు తాహసిల్దార్ సాను కూలంగా స్పందిస్తూ,ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు సూరి రాయల్, పార్టీ సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు నాదమునిరెడ్డి, బుజ్జి నాయుడు, పాత వీరాపురం భాస్కర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!