EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

శివాజీ మృతి కేసులో ముగ్గురు అరెస్ట్ నిందితుల పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 09:

 

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కత్తి వారి కండ్రిగ గ్రామానికి సంబంధించిన శివాజీ అనే వ్యక్తి ఈనెల ఏడవ తేదీ విద్యుత్ ఘాతానికి గురై చనిపోయిన సంఘటనలో పోలీసులు నేడు ముగ్గురు నిందితులని అదుపులో తీసుకొని వారిని విచారించి వారి పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డివిజన్ డిఎస్పి ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ తొట్టంబేడు మండలం కత్తి వారి కండ్రిగ గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి ఈనెల ఏడవ తేదీన సమీపంలోని మామిడి తోపు వద్ద విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన లలో ముగ్గురు నిందితుల్ని అదుపులో తీసుకున్నామని దొరబాబు, కత్తి గురవయ్య, కత్తి సుధాకర్, వీరు అటవీ జంతువులను వేటాడడానికి అక్కడ విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారని.అది గమనించని శివాజీ అటు పక్కగా వెళ్లగా ఆ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడని. విచారణలో ముగ్గురు నిందితులు ఉన్నారని తెలుసుకొని వారిని నేడు అరెస్టు చేశామని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలియజేశారు, రైతులు అడవి జంతువులు వేటాడే వారు ఇలాంటి విద్యుత్ తీగలను ఇకపై ఉపయోగించే రాదని అలా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇలా కరెంటు విద్యుత్ తీగలు ఉపయోగించినప్పుడు అటుపక్కగా వెళ్లేవారు ఈ విద్యుత్ గా తీగలను గమనించకుండా మృతి చెందుతున్నారని దానివల్ల ఒక కుటుంబం అనాధ అవుతుందని ఇకనైనా రైతులు ప్రజలు అవగాహన పెంచుకొని ఇటువంటి విద్యుత్ తీగలను ఉపయోగించవద్దని, ఆయన గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డిఎస్పి ఎన్ఎస్ మూర్తి, తొట్టంబేడు సీఐ తిమ్మయ్య,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!