EPAPER
Thursday, August 20, 2026
Google search engine

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఎస్‌ఆర్‌పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్ మే 28:

 

ఎస్‌ఆర్‌పురం మండలం గంగమ్మగుడి గ్రామంలో నిర్వహించిన మహానాడు రెండో రోజు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సా హంగా జరుపుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో నాయకులు కేక్ కట్ చేసి జయంతి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండ ల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయ శంకర్ నాయుడు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే పార్టీ నాయకత్వం ప్రజాసేవలో ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కామసాని నిరంజన్, జిల్లా నాయకులు రాజశేఖర్ నాయుడు, రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, పైనేని ధనుంజయ నాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తరుగు పూర్ణిమ బాబు, పైనేని మురళి, మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ బాలాజీ నాయుడు, బాబు నాయుడు, సిద్దయ్య శెట్టి, జలంధర్ నాయుడు, బల్లాల దేవరాజులు నాయుడు, సూరి రెడ్డి, త్యాగరాజు నాయుడు, రామిరెడ్డి, నోమేశ్వర్ రెడ్డి, బ్రహ్మయ్య నాయుడు, మండల యువత అధ్యక్షుడు చంద్ర బాబు రెడ్డి,కాంట్రాక్టర్ ఆంజనేయులు, పురుషోత్తం నాయుడు, నాయకులు నరేష్,కెం రవి,మధు,హేమాద్రితో పాటు మహిళా కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు. ప్రాంతీయ ప్రజలు, పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!