EPAPER
Thursday, August 20, 2026
Google search engine

చిత్తూరు జిల్లా ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా  రాజశేఖర్ రాజు బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 28:

 

 

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు నాన్ కేడర్ ఎస్పీ హోదాతో పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతిలో భాగంగా నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన రాజశేఖర్ రాజు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్స్ ఎస్పీగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీక్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది రాజశేఖర్ రాజుకు అభినందనలు తెలిపారు. జిల్లా పోలీసు శాఖలో శాంతిభద్రతల పరిరక్షణ, ఆపరేషన్స్ విభాగం సమర్థ నిర్వహణకు కృషి చేస్తానని రాజశేఖర్ రాజు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!