EPAPER
Sunday, October 18, 2026
Google search engine

టీడీపీ సీనియర్ నాయకులకు ఘన సన్మానం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 28:

 

 

చిత్తూరు జిల్లాకుప్పం పట్టణంలో మహానాడు కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న సీనియర్ నాయకులను ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షుడు పీఎస్ మునిరత్నం, పీకేఎం పట్టణా భివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు,రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.పార్టీ బలోపేతానికి కృషి చేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్‌కుమార్, డాక్టర్ సుధీర్, డాక్టర్ వెంకటేష్, కాణిపాకం వెంకటేష్, కౌన్సిలర్ జిమ్ దాము, ఆర్ ఆర్ రవి, సోమశేఖర్, సత్యేంద్ర శేఖర్, గాజుల గోపీనాథ్, ఆర్ముగం, దయాకర్, సురేష్, నరేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మహిళలు, టిడిపి కుటుంబ సభ్యులు  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!