పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:
పలమనేరు రూరల్ మండలం కోలమాసనపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని పలమనేరు సీఐ. కె. మోహన్ రెడ్డి కి వచ్చిన సమాచారం మేరకు మంగళవారం 4.00 గంటలకి ఎస్సై లోకేష్ రెడ్డి, మరియు సిబ్బందితో కలిసి కోలమాసనపల్లి అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఐదు మందిని పట్టు కున్నారు ముగ్గురు పరారయ్యారని వారు తెలిపారు పట్టుకున్న వారి దగ్గర నుంచి 52 పేక ముక్కలు మరియు 50,310/- రూపాయలను స్వాధీనం చేసుకుని పేకాట ఆడిన 8 మంది పైన పలమనేరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు


Recent Comments