కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:
సంఘసంస్కర్త, అనగారిన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శాంతిపురం తాసిల్దార్ కార్యాలయం ముందు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు కలిసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మార్పీఎస్, భారతీయ అంబేద్కర్ సేన, ఆల్ ఇండియా బంజర సేవా సంఘం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, దళిత ఉద్యమ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుని, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అనంతరం కుప్పంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని జనసేన, తెలుగుదేశం, ఎమ్మార్పీఎస్, భారతీయ అంబేద్కర్ సేన, ఆల్ ఇండియా బంజర సేవా సంఘం నాయకులు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో భారతీయ అంబేద్కర్ సేన స్టేట్ సెక్రటరీ బాలకృష్ణ, దళిత ఉద్యమ నాయకుడు దేవరాజ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు రాజ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకుడు డీకేపల్లి మురుగేష్ మాదిగ, జిల్లా నాయకుడు ఎల్లప్ప, శంకరప్ప, నాగభూషణం, మంజునాథ్, జనసేన పార్టీ నాయకులు వేణు, సుభాష్, ఆల్ ఇండియా బంజర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రవి నాయక్, జనసైనికులు చందు, మున్సిపల్ అధ్యక్షుడు ప్రవీణ్, గణేష్, జయచంద్ర, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఎల్లప్ప, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యేంద్ర శేఖర్, శాంతిపురం మండల అధ్యక్షుడు నందిగామ ఉదయ్ కుమార్ నాయుడు, సొసైటీ అధ్యక్షుడు గోపాల్, తాసిల్దార్ ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments