EPAPER
Saturday, April 18, 2026
Google search engine

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ నియామకం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం నారా లోకేష్ ఆశీస్సులతో జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, పార్టీపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2029లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కట్టుబడిపనిచేస్తానని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని మరింత బలపరిచేందుకు ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతానన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!