EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పేదల రేషన్ బియ్యం మాఫియా చేతిలోకి..  అక్రమ రవాణా రాత్రి దందా!

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 27,

 

 

తిరుపతి జిల్లా తడ మండలం, నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా సంచరణ భారీగా సాగుతోంది. రాత్రి వేళల్లో లారీలు, బస్తాలు నింపి పక్కదారాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. లోతువాణి గుంటల్లో నిల్వలు, అధికారుల మౌనంనాయుడుపేట తడ మండలంలోని అక్కంపేట గ్రామం లేఔట్‌లో 24 గంటల పాటు లారీలు లోడ్ అవుతున్నాయి. తోడు గుంటల్లో రేషన్ బస్తాలు మునిగిపోయినట్టు నిల్వలు ఉన్నాయి. ఎమ్మార్వోలకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా చూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పట్టణ శివార్లు మాఫియా కోటలు పేదల నుంచి తక్కువ ధరకు సేకరించిన రాయితీ బియ్యాన్ని వరదయ్యపాలెం, సత్యవేడు ప్రాంతాల్లో నిల్వ చేసి ఇతర చోట్లకు పంపుతున్నారు. ప్రభుత్వ ప్రజాధనం కోట్లాది రూపాయలు మాఫియా జేబుల్లోకి పోతోంది. రెవెన్యూ, విజిలెన్స్ యంత్రాంగం కన్నీటి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల డిమాండ్: చెక్‌పోస్టులు,దాడులు అక్రమార్కులు బహిరంగంగానే ఆట ఆడుతున్నారు. హత్య ప్రయత్నాలు, పోలీస్ కేసులు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచి, నిల్వ కేంద్రాలపై దాడులు చేసి మాఫియా సూత్రధారులను శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!