EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

వి.కోట మండల కేంద్రంలో ఈ- సైకిళ్ళను ,చెత్త సేకరణ ఆటోలను  జెండా ఊపి ప్రారంభించిన పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి 

📰 Generate e-Paper Clip

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 27:

 

ఈ సైకిళ్ళు,ఆటలు పంపిణీ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి మహిళా భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మహిళలు సామాజిక,ఆర్థిక,విద్య అన్ని రంగాల్లో రాణించాలని ఇంటికో మహిళా పారిశ్రామిక వేత్తను చేయాలన్నదే నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఆర్థికంగా… సామాజికంగా… పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తేనే దేశం అభివృద్ధి సాధ్యమవు తుందని, మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. దాంతోపాటు ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే నేడు చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకొని విరివిగా రుణాలు సైతం మహిళా గ్రూపు సంఘాలకు అందిస్తున్నామన్నారు. కాబట్టి మహిళలు సామాజిక,ఆర్థిక, రాజకీయ మరియు విద్యా రంగాలలో పురుషులకు ధీటుగా రాణించాలని ఆయన సూచించారు. మహిళలు పురుషులతో సమానంగా ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉన్నపుడే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని, విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి అభివృద్ధి, సంక్షేమం లో భాగస్వామ్యం కావాలని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు రామచంద్ర నాయుడు,ఏపీ స్టేట్ వేర్ హౌస్ కమిటీ సభ్యులు రంగనాథ్, ఇరిగేషన్ డైరెక్టర్ గజేంద్ర, మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజన్న, వైస్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్,ఎంపిడివో వెంకటేశ్వర్ రావ్,టిడిపి మండల అధ్యక్షులు రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ గౌడ్,చౌడప్ప, ధీరజ్,గజేంద్ర, శభరీష్,మైనారిటీ నాయకులు అక్మల్, గౌస్,బీజేపీ నాయకులు విజయ్ కుమార్,వెలుగు సిబ్బంది, మహిళలు అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!