EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఘనంగా మొల్ల (మల్లమాంబ) జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

వెదురు కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి14:

 

చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ మొరవ గ్రామంలో ఆదికవిత్రి ఆతుకూరి మొల్ల (మల్లమాంబ) జయంతి ఘనంగా జరిగింది.సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ పాండిత్యం ప్రదర్శించి తెలుగు సాహిత్య చరిత్రలో రామాయణాన్ని తెలుగులో మొదట రచించిన మహిళగా మొల్ల చరిత్రలో గొప్ప స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆమె అసమాన పాండిత్యాన్ని కొనియాడారు. తక్కువ కాలంలో పండితుల నుండి పామరుల వరకు అర్థమయ్యేలా రామాయణం రచించిన మొల్ల అతి గొప్ప భక్తురాలు అని చాలామంది కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్, చిత్తూరు జిల్లా ఓబీసీ మోర్చా ఇంచార్జ్ ప్రేమ్ కుమార్, చిత్తూరు జిల్లా ఓబీసీ అధ్యక్షుడు కైలాసం, చిత్తూరు జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ గిరిజా రెడ్డి, వివిధ మండలాల బిజెపి బాధ్యులు హాజరై మొల్ల మహిమలను వివరించారు. కార్యక్రమాన్ని బిజెపి మండల అధ్యక్షుడు బి. అశోక్ రెడ్డి నిర్వహించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!