EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

రైతుల కళ్లలో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి లక్ష్యం

📰 Generate e-Paper Clip

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, మార్చి14:

 

రైతులకళ్లలో ఆనందం చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయు డు లక్ష్యమని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ అధికా ర ప్రతినిధి గౌని వారి శ్రీనివాసులు అన్నా రు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ‘పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ’ ద్వారా ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తూ దేశంలోనే అత్యధిక భరోసానిస్తోందన్నా రు. తాజాగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,670 కోట్లను నేరుగా జమ చేసి కుటుంబ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందన్నారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా,డ్రోన్ సాంకేతిక త, డ్రిప్ ఇరిగేషన్, ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ఏర్పాటుతో వ్యవసాయా న్ని ఆధునీకరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేస్తూ,ధాన్యం సేకరణలో పారదర్శకత, ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ కల్పిస్తూ అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. సంక్షేమం,సాంకేతికతలతో వ్యవసాయా న్ని సుస్థిరం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు సాగుతోందన్నారు. సూపర్ సిక్స్ ని కూట మి ప్రభుత్వం సూపర్ హిట్ చేసిందన్నా రు. శుక్రవారం ‘అన్నదాత-సుఖీభవ’ మూడవ విడత నిధులు రైతుల ఖాతా లో జమ చేయడం జరిగిందన్నారు. కేంద్ర సహకారంతో అమలు అవుతున్న ఈ పధకం మూడో విడత నిధులను సూరం పల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడు దల చేశారన్నారు. మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో రూ.6,000 జమ చేశారన్నారు. మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్రప్రభుత్వా లు ఖర్చు చేస్తున్నాయన్నారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు అని వివరించారు. ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14వేలను ప్రభుత్వం అందిం చిందని,2025 ఆగస్ట్ 2న మొదటి విడత గా రూ.7వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు అందించింద న్నారు. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరుల కు కూటమి ప్రభుత్వం రూ.8,985 కోట్లు అందించినట్లు అవుతుందన్నారు. ఇందు లో రాష్ట్ర వాటా రూ.6,560 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.2,425 కోట్లుఅని ఆయన తెలిపారు. ధరల స్థితి కరణతో అండగా: ప్రకృతి విపత్తులు వచ్చినప్పు డు రూ.310 కోట్లు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. గిట్టుబాటు ధర కోసం రూ.500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. మామిడి కూడా గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడ్డారని,ప్రతి కేజీకి రూ.4 లు ఇచ్చామన్నారు. పొగాకు రైతులకు రూ.200 కోట్లకు పైగా సాయం అందించు కుందామన్నారు. ఉల్లి రైతుల కు హెక్టారుకు రూ.50 వేలు, టమాటా రైతులను, కోకో రైతులను ఆదుకున్నామ న్నారు. రూ.1338 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందన్నారు. గత పాలన వల్ల రాష్ట్రం అప్పుల సుడిగుండంలో నెట్టబడిందని విమర్శించారు. పెట్టుబడు లు పెట్టేవారు కూడా రాలేదన్నారు. ఈ 20 నెలల్లో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంద న్నారు. ముందుకెళ్తున్నాం. 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 24 గంటల్లోనే రైతుల ఖాతాలో కూటమి ప్రభుత్వం డబ్బులు వేస్తూ ఉందన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!