రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి14:
రాష్ట్ర ప్రజల కోసం ఉద్భవించిన పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిన్న తోటి నాగరాజు స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు మరియు పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జెండాను ఎగురువేసి జన సైనికులు ప్రజల మధ్య కేకు ను కట్ చేసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నతోటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఉద్భవించిన నాయకుడని అన్నారు. రాష్ట్రానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. జనసేన పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడులాగా పనిచేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. పట్టణాధ్యక్షుడు ఆకుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లోనూ జనసేన పార్టీ తమ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షురాలు ఆకుల భాగ్యలక్ష్మి, పట్టణ ఉప అధ్యక్షులు పార్థ సారథి, మండల నాయకులు జనరల్ సెక్రటరీ తోట ముకేశ్, ఆకుల తిలక్, తండ్లం లోకేష్ ,కోబాకు పాండు,సతీష్ , వీర మహిళా అనురాధ ,రమేష్ రెడ్డి ,మునికృష్ణ ,బసవ పున్నయ్య ,వెంకీ ,వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.


Recent Comments