EPAPER
Saturday, April 18, 2026
Google search engine

హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

గుడుపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 10:

 

కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల పరిధిలో గుడుపల్లి సర్కిల్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. గ్రేస్ మేరియా సేవా విద్యా ట్రస్టు ఆధ్వర్యంలో, పోలీసు శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫ్లాష్ మొబ్ ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై సందేశాలు అందించారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రాణ రక్షణలో హెల్మెట్ వినియోగం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబుడుగూరు ఎస్సై నరేష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ఆరోగ్య రాజ్, జేసు మేరీతో పాటు గంగరాజు గొల్లపల్లి ట్యూషన్ విద్యార్థులు పాల్గొని ఫ్లాష్ మొబ్ ద్వారా హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని చూసిన స్థానికులు పోలీసు శాఖ, ట్రస్టు చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!