
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 29:
శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీరుసెల్వం ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేశారు. వీరిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి,శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి.కే. వెంకటేశులు , దక్షిణ గోపురం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వాగతం పలికారు.అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ప్రత్యేక ఐదువేల రూపాయలు రాహుకేతు నివారణ పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి వేదపండితులచే ఆశీర్వదించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి బి.కే వెంకటేశులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గోపీనాథ్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏ.ఈ.ఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏ.పీ.ఆర్.ఓ రవి,ఆలయ అధికారులు ,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments