సూళ్లూరుపేట, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 29:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 44 సంవత్సరాలు పూర్తవుతుందని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. సూళ్లూరుపేట లోని శేష సాయి కళ్యాణ మండపము నందు జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు శివప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు నుండి ఇప్పటివరకు పార్టీకి వెన్నుదన్నుల కార్యకర్తలే అండగా ఉన్నారని, నందమూరి తారక రామారావు ఆశయాలు, సిద్ధాంతాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి అలుపెరగని కృషితో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే నిజమైన బలమని తెలిపారు. వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు పార్టీ సంస్థాగత నిర్మాణానికి సూళ్లూరుపేట నియోజకవర్గంలో వేనాటి వంశస్తులు పార్టీకి చేసిన సేవ ఎంతో గుర్తించదగ్గదని తెలిపారు. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ కోసం అలుపెరగని శ్రామికులలా పని చేస్తున్నారని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తుపెట్టుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments