EPAPER
Sunday, October 18, 2026
Google search engine

రాయలసీమను రత్నాలసీమగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 08
శ్రీకాళహస్తి: రాయలసీమను రత్నాలసీమగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాళహస్తిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న కృషితో రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు.శ్రీకాళహస్తి ప్రాంతంలోని పరిశ్రమలు, విమానాశ్రయం, జాతీయ రహదారులు, సమీపంలోని శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ రాయలసీమలో వ్యాపార విస్తరణకు ఆసక్తి చూపడం రాష్ట్రంలో అనుకూల పారిశ్రామిక వాతావరణానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమలో ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తూ పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, తొట్టంబేడు మండల టీడీపీ అధ్యక్షుడు రావెళ్ల మునిరాజనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!