
శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 11:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా అందించే సహాయ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందింది. ఈ పథకం ద్వారా మంజూరైన నగదును బాధిత కుటుంబానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ సభ్యత్వ సహాయ పథకం ద్వారా రూ.5 లక్షలు అందడం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, ఈ ఆర్థిక సాయం అందేలా చేసిన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెనమాకులపల్లి పంచాయతీ అధ్యక్షుడు, సర్పంచ్ అభ్యర్థి ఎన్.పి. శివకుమార్, రాధాకృష్ణ, కోదండ నాయుడు, ఈడుగ చరణ్, క్లస్టర్ ఇన్చార్జ్ రాజేంద్ర, కెదిరినాథ్ నాయుడు, మురళి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Recent Comments