EPAPER
Sunday, October 18, 2026
Google search engine

ప్రభుత్వ ఆసుపత్రికి కోకాకోలా పరిశ్రమ కంప్యూటర్లు వితరణ

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 08శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి స్థానిక కోకాకోలా పరిశ్రమ యాజమాన్యం రూ.15 లక్షల విలువైన 15 కంప్యూటర్‌ సిస్టమ్‌లను అందజేసింది. శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళికి కంప్యూటర్లను అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని కోరారు. ఆసుపత్రిలో డిజిటల్‌ సేవలను బలోపేతం చేసేందుకు రూ.15 లక్షల వ్యయంతో కంప్యూటర్‌ సిస్టమ్‌లను అందించిన కోకాకోలా పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కోకాకోలా పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి స్థానిక కోకాకోలా పరిశ్రమ యాజమాన్యం రూ.15 లక్షల విలువైన 15 కంప్యూటర్‌ సిస్టమ్‌లను అందజేసింది. శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళికి కంప్యూటర్లను అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని కోరారు. ఆసుపత్రిలో డిజిటల్‌ సేవలను బలోపేతం చేసేందుకు రూ.15 లక్షల వ్యయంతో కంప్యూటర్‌ సిస్టమ్‌లను అందించిన కోకాకోలా పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కోకాకోలా పరిశ్రమ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!