EPAPER
Sunday, October 18, 2026
Google search engine

రామకుప్పం పరిధిలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. 5వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం రౌడీషీటర్ల కదలికలపై నిఘా..  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్10:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో అక్రమ మద్యం తయారీ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రామకుప్పం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యానాది కాలనీ, గుడ్డూరు అటవీ ప్రాంతాల్లో కుప్పం రూరల్‌ సీఐ మల్లేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 5,000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు కుప్పం సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ హేమంత్‌ బొడ్డు, ఐపీఎస్‌ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, రౌడీషీటర్ల కదలికలు, ప్రస్తుత కార్యకలాపాలపై ఆరా తీశారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలు సహా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా కుప్పం రూరల్‌ సీఐ మల్లేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు, అక్రమ మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో రామకుప్పం ఎస్‌ఐ మరెప్ప, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేష్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!