EPAPER
Saturday, April 18, 2026
Google search engine

పైపాళ్యం జెడ్పీ హైస్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవం వేడుకలలో     పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:

 

 

కుప్పం రూరల్ మండలం పైపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పి కె ఎం ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను పాటలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను వీక్షించిన ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలను ప్రశంసించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులు విద్యార్థులను ప్రోత్సహించడం విశేషంగా నిలిచింది. భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!