
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 15:
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కుప్పం జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎం ఛార్వి నియోజకవర్గ టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటింది. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించి విశేష ఫలితం నమోదు చేసింది. ఇంగ్లీష్, సంస్కృతం మినహా మిగతా అన్ని సబ్జెక్టులతో పాటు ప్రాక్టికల్స్‌లో సెంటం మార్కులు సాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫలితాలతో బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. ఛార్వి సాధించిన ఈ విజయంపై కాలేజీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. కృషి, పట్టుదలతో చదివితే ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఈ ఫలితం నిరూపించినట్టు పేర్కొన్నారు.


Recent Comments