EPAPER
Saturday, April 18, 2026
Google search engine

కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక డబ్బుల వసూలుపై హెచ్చరిక

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 08

 

కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పనుల పేరుతో ఎవరైనా అనధికారికంగా అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడ పీడీ వికాస్ మర్మత్ హెచ్చరించారు. కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పలువురు ప్రజలను పీడీ పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కార్యాలయంలో అనుమతి లేకుండా రైటర్లు ప్రవేశించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా తమకు ఎదురైన సమస్యలను అధికారులకు తెలియజేయాలని సూచించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!