EPAPER
Saturday, April 18, 2026
Google search engine

ఇందిరమ్మ గృహంతో సొంతింటి కల నెరవేరింది

📰 Generate e-Paper Clip

జడ్చర్ల,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 08:

 

జడ్చర్ల మున్సిపాలిటీ 10వ వార్డులో మదన్ శ్రీలక్ష్మి కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పాలత నర్సిములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ఇందిరమ్మ గృహ పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శాసనసభ్యుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో మరింతమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కుమ్మరి రాజు, చైతన్య చౌహన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, శగా రవి, పార్టీ యువ నాయకులు కృష్ణ, కమలం శేఖర్, కుమ్మరి సందీప్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!