శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 08
శ్రీకాళహస్తి సబ్ డివిజన్ నూతన పోలీస్ ఆఫీసర్గా బి. పావని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దొంగతనాలను అరికట్టడంతో పాటు రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ప్రజల సహకారంతో శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని నూతన సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ బి. పావని పేర్కొన్నారు.



Recent Comments