EPAPER
Sunday, October 18, 2026
Google search engine

కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు స్థానిక ఎన్నికల్లో నిబద్ధత గల వారికి ప్రాధాన్యత

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తిలో టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం


శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 08
శ్రీకాళహస్తి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి జిల్లా ఎన్నికల అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించిన నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యతతో పాటు తగిన పదవులు, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల త్యాగాలు, శ్రమ ఎన్నటికీ వృథా కావని, కష్టపడే ప్రతి ఒక్కరినీ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది అని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్న ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ, నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పనబాక లక్ష్మి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన కార్యకర్తలే పార్టీకి అసలైన ఆస్తి అని పేర్కొన్నారు. వారి శ్రమ, పనితీరు ఆధారంగానే భవిష్యత్‌లో రాజకీయ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేసి పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ పార్టీ యంత్రాంగం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయమే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కీలకమని అన్నారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు పార్టీ కోసం సేవ చేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్త పనితీరును పార్టీ గమనిస్తోందని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!