EPAPER
Sunday, October 18, 2026
Google search engine

గాంధీజీ ఆశయాల సాధనకు సమష్టిగా కృషి చేయాలి కడ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 02:

 

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కుప్పంలోని కడ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వికాస్ మర్మత్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత, సేవాభావం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల న్నారు. కుప్పం ప్రాంతంలో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్, కడ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!