EPAPER
Sunday, October 18, 2026
Google search engine

పి.బి.వాడలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

గుడిపల్లి,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 04:

 

కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ కె.ఆర్.జె. భరత్ ఆదేశాల మేరకు గుడిపల్లి మండలం పి.బి.వాడ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కె.ఆర్.జె. భరత్ నాయకత్వంలో కుప్పం నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణ, మండల బూత్ కన్వీనర్ సంపంగి, మండల కో-కన్వీనర్ చంద్రయ్యన్, క్లస్టర్ ఇన్‌చార్జి ముని, కుప్పం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు అయ్యవారప్ప, పి.బి.వాడ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు మంజు, సీనియర్ నాయకులు రాజు, చిత్తూరు జిల్లా యువజన విభాగం జాయింట్ సెక్రటరీ రవి, తీర్థగిరి తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!