EPAPER
Sunday, October 18, 2026
Google search engine

బాలలపై నేరాల నివారణకు గ్రామస్థాయిలో కమిటీలు కీలకం విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీతో బాలల హక్కులకు రక్షణ

📰 Generate e-Paper Clip

తాడేపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 01:

 

గ్రామస్థాయిలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తే బాలలపై జరిగే అనేక నేరాలను అరికట్టవచ్చని గుడ్ షెఫర్డ్ సిబ్బంది అత్తోట పోతురాజు అన్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గురువారం విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఎ.పి.జె. అబ్దుల్ కలాం బాలల పార్లమెంట్‌కు అండగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్తోట పోతురాజు మాట్లాడుతూ గ్రామాల్లో బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమం కోసం విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ లేకుండా చూడటం, బాల్య వివాహాలను అడ్డుకోవడం, పిల్లల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలలపై హింసకు సంబంధించిన చట్టాలపై తల్లిదండ్రులు, గ్రామస్థులకు అవగాహన కల్పించడం కమిటీ ప్రధాన బాధ్యతల్లో భాగమని వివరించారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులు, ఇతర హింసకు గురవుతున్న పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించడంతో పాటు, బాలల హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన విషయాలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఆపదలో ఉన్న, అనాథ, నిరుపేద పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని చెప్పారు. గ్రామస్థాయిలో క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహించి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. పిల్లలు గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బాలలపై ఏదైనా హక్కుల ఉల్లంఘన, హింస లేదా ప్రమాద పరిస్థితి ఎదురైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, స్థానిక పోలీస్ శాఖ లేదా జిల్లా బాలల పరిరక్షణ యూనిట్‌కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిబ్బంది అత్తోట పోతురాజు, ఎ.పి.జె. అబ్దుల్ కలాం బాలల పార్లమెంట్ సభ్యులు, విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!