EPAPER
Sunday, October 18, 2026
Google search engine

కుప్పం సబ్‌డివిజన్‌లో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు అక్టోబర్‌ 2 నుంచి 31 వరకు నిషేధాజ్ఞలు.. ముందస్తు అనుమతి తప్పనిసరి. కుప్పం ఏఎస్పీ బి. హేమంత్‌ ఐపీఎస్‌

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 01:

 

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుప్పం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు కుప్పం ఏఎస్పీ బి. హేమంత్‌ ఐపీఎస్‌ తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి ఐపీఎస్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 2 నుంచి 31వ తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. సెక్షన్‌ 30 అమల్లో ఉన్న కాలంలో పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలు నిర్వహించరాదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఏదైనా సభ, సమావేశం లేదా ఊరేగింపు నిర్వహించాల్సి ఉంటే ముందుగా సంబంధిత పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. కుప్పం సబ్‌డివిజన్‌ పరిధిలోని కుప్పం అర్బన్‌, గుడుపల్లి, రాళ్లబూదుగూరు, రామకుప్పం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజల శాంతి, భద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంటూ ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ బి. హేమంత్‌ విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!