EPAPER
Sunday, October 18, 2026
Google search engine

పల్లెనిద్రలో ప్రజలకు పోలీసుల అవగాహన రూరల్ సీఐ మల్లేష్ యాదవ్

📰 Generate e-Paper Clip

గుడుపల్లి,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 25:

 

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు, కుప్పం ఏఎస్పీ హేమంత్ బొడ్డు ఐపీఎస్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడుపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు కొడతనపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, దొంగతనాలు, ఆర్థిక నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ధైర్యస్పర్శ కార్యక్రమం, పోక్సో చట్టం, మైనర్ మిస్సింగ్ కేసులు, బాల్యవివాహాల నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!