EPAPER
Sunday, October 18, 2026
Google search engine

నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ జాకీర్ అహ్మద్

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 25

 

నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కౌన్సిలర్ జాకీర్ అహ్మద్ సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని టైలర్ హైస్కూల్‌లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాకీర్ అహ్మద్ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల శారీరక ఎదుగుదల, రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. చెప్పులు లేకుండా నడవడం, మట్టిలో ఆడటం, చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడం వంటి కారణాలతో పిల్లలకు నులిపురుగుల సమస్య ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. నులిపురుగుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శుభ్రమైన నీటిని తాగాలని, పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాతే తీసుకోవాలని, భోజనానికి ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!