
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్,సెప్టెంబర్ 25:
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాదు.. ఆఖరి మజిలీలోనూ మానవత్వాన్ని చాటుతూ కుప్పం జీఆర్పీ పోలీసులు సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. కుప్పం–మల్లనూరు రైల్వే స్టేషన్ల మధ్య మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ లేకపోవడంతో డీకే పల్లి మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం అలియాస్ మణి సహకారంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎవరూ తమవారు కానప్పటికీ.. ఆఖరి సమయంలో ఆ వ్యక్తికి తామున్నామంటూ పోలీసులు మానవీయతతో అంతిమ వీడ్కోలు పలికారు. అనాథ మృతదేహాలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్న సేవలో ఇది 88వ కార్యక్రమమని తెలిపారు. ఫొటోలోని వ్యక్తిని గుర్తించిన వారు కుప్పం జీఆర్పీ హెడ్ కానిస్టేబుళ్లు శివశంకర్, రమేష్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.


Recent Comments