EPAPER
Sunday, October 18, 2026
Google search engine

హాకీ క్రీడకు కుప్పంలో కొత్త ఊపిరి..   శాశ్వత టర్ఫ్‌తో యువతకు ప్రోత్సాహం

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 25:

 

చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ ఐఏఎస్, సాప్ డైరెక్టర్, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజని గారిని లయన్స్ క్లబ్ ప్రతినిధి ఏ. మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుప్పంలో హాకీ క్రీడ అభివృద్ధి, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రజని చేస్తున్న కృషిని మహేష్ అభినందించారు. కుప్పంలో శాశ్వత హాకీ టర్ఫ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హాకీ టర్ఫ్ అందుబాటులోకి రావడం ద్వారా కుప్పం ప్రాంతంలోని యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సాధనకు వేదిక ఏర్పడి భవిష్యత్ ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కుప్పంలో క్రీడాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న కాడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఐఏఎస్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కుప్పాన్ని క్రీడా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని మహేష్ అన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!