
ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,సెప్టెంబర్ 17:
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్తూరులోని పొన్నియమ్మ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం క్యాండిల్ దీపాలు వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. దేశ అభివృద్ధికి ప్రధాని చేస్తున్న కృషిని ఎంపీ కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, సునీల్ చౌదరి, గంధమనేని రాజశేఖర్ నాయుడు, శ్రీధర్ యాదవ్, ఎన్పీఎస్ జయప్రకాష్, తలారి రెడ్డప్ప తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.


Recent Comments