
తిరుపతి,చిత్తూరు ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 16:
తిరుపతిలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో శాంతిపురం మండలం కేనమాకులపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సత్తా చాటి పలు బహుమతులు సాధించారు. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చారు. 600 మీటర్ల పరుగుపందెంలో వి. దినేష్ ప్రథమ స్థానం సాధించి సత్తా చాటగా, ఇదే విభాగంలో రెడ్డి జస్వంత్ తృతీయ స్థానం సాధించాడు. హైజంప్ విభాగంలో ఆకాశ్ తృతీయ స్థానం కైవసం చేసుకున్నాడు. జావెలిన్ త్రోలో ఎం. చరణ్ తృతీయ స్థానం సాధించి ప్రతిభను చాటాడు. విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించి, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించేలా క్రీడల్లో మరింతగా శిక్షణ పొందాలని ఆకాంక్షించారు.


Recent Comments