EPAPER
Sunday, October 18, 2026
Google search engine

17 నుంచి బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి: కోలా ఆనంద్

📰 Generate e-Paper Clip

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 15:

 

శ్రీకాళహస్తి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అభియాన్ కో-కన్వీనర్ కోలా ఆనంద్ తెలిపారు.శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభియాన్‌లో భాగంగా గ్రామాల్లో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛభారత్, మొక్కలు నాటడం, విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు, సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభియాన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కండ్రిగ ఉమా, మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కునాటి నాగరాజు, ప్రజ్ఞాశ్రీ, తేజోవతి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!