
శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 15:
శ్రీకాళహస్తి: వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని 18వ వార్డు ఈశ్వరయ్య కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ నరసింహమూర్తి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపై వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచిభవిష్యత్తును అందించాలని సూచించారు. బాల్యవివాహాలను అరికట్టాలని,ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, పట్టణ సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు, నాయకులు బాబు, మునిరాజా, సునీల్తో పాటు కాలనీ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.


Recent Comments