EPAPER
Sunday, October 18, 2026
Google search engine

గ్రామాలు అభివృద్ధి చెందితే జీడీపీ రేటు పెరుగుతుంది గ్రామ వికాసానికి సమష్టి కృషి అవసరం: సతీష్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

ఎస్‌ఆర్‌పురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబరు05:

 

గ్రామాలు అభివృద్ధి చెందితే దేశ జీడీపీ రేటు పెరుగుతుందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు సభ్యుడు, డీఆర్‌డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పాలసముద్రం మండలం తిరుమలరాజు పురం పంచాయతీ పరిధిలో ఏట్రియా ఫౌండేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్ చిత్తూరు’ గ్రామీణాభివృద్ధి కార్య క్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, సోలార్ విద్యుత్, విద్య,ఉపాధి వంటి రంగాల్లో గ్రామాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లోనే ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరిగితే పట్టణాలకు వలసలు తగ్గుతాయని తెలిపారు. ప్రాజెక్టును 60వేల ఎకరాలకు విస్తరించేందుకు రూపొందించిన కార్యా చరణ ప్రణాళికను ప్రారంభించినట్లు చెప్పారు.గ్రామంలో నీటికొలను ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు నిర్వాహకులకు సూచించారు. మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి,ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.నీరజ మాట్లాడుతూ రైతులు,పొదుపు మహిళా సంఘాల సహకారంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ చైర్మన్ సుందర్‌ రాజు మాట్లాడుతూ… సుస్థిర వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, ఆధునిక విద్య,అగ్రో టూరిజం– వెల్‌నెస్‌ ను ప్రధాన అంశాలుగా తీసుకు నిస్వయం సమృద్ధి గ్రామీణ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.లక్ష ఆదాయం కల్పించడం తో పాటు 600 ఎకరాల్లో 6 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 600 ఎకరాల్లో పనులుకొనసాగుతున్నాయని, జూన్‌ 2027 నాటికి 6 వేల ఎకరాలకు, తదుపరి 24 నెలల్లో 60 వేల ఎకరాలకు విస్తరించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అన్న పూర్ణ,ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలకృష్ణరాజు, రాజశేఖర్‌రాజు,కార్తీక్‌రాజు,దీప్తినందన్, అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పవర్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!