
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్,సెప్టెంబరు 04:
కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కుప్పం చిత్రకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) వినూత్నంగా తన చిత్రకళా ప్రతిభను చాటుకున్నారు. నెమలి ఈకపై చిన్ని కృష్ణుడి చిత్రాన్ని అద్భుతంగా పెయింటింగ్ వేసి అందరినీ అబ్బురపరిచారు. కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెమలి ఈకపై బాలకృష్ణుడి చిత్రాన్ని చిత్రించడం తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని పురుషోత్తం తెలిపారు. అతి చిన్న ప్రదేశంలోనూ కృష్ణుడి రూపాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం విశేషంగా నిలిచింది. పురుషోత్తం వేసిన ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెమలి ఈకపై చిన్ని కృష్ణుడి చిత్రాన్ని చూసిన పలువురు నెటిజన్లు ఆయన కళా ప్రతిభను అభినందిస్తున్నారు.


Recent Comments