శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్
శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేకతను తెలియజేస్తూ రచయిత గంగపుత్ర గాంధీ ప్రత్యేక పాటను రచించారు. ఈ పాటకు సంబంధించిన నృత్య ప్రదర్శనను క్లాసికల్ డాన్సర్ చిరంజీవి పావనిప్రారంభించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ నిర్వహించే వివిధ వేడుకలు, ఉత్సవాల విశిష్టతను పాట ద్వారా చిత్రీకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్‌బాబు, కెమెరామెన్ ప్రదీప్‌కుమార్, రామకృష్ణ, రేఖ తదితరులు పాల్గొన్నారు.



Recent Comments