EPAPER
Friday, September 4, 2026
Google search engine

మంచుకొండల మాటున వినబడని ఘోష…మంజుల పత్తిపాటి

📰 Generate e-Paper Clip

భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 31:

 

భారతదేశానికి హిమాలయాలు

కేవలం మంచుకొండలు కావు…

దేశానికి సహజ కవచాలు,

నదులకు జీవనధారలు,

వాతావరణానికి సమతుల్యాలు,

భారత భూభాగానికి

ప్రకృతి ప్రసాదించిన ప్రాణాధారాలు..!

 

మనం చూస్తున్న హిమాలయాలు

కేవలం పర్యాటక ప్రదేశాలు కావు…

తరతరాల భవిష్యత్తుకు

ప్రకృతి రాసిన భద్రతా పుటలు..!

 

కానీ మనకు రక్షణ కవచంలా ఉన్న

హిమాలయాల ఒడిలోకి వెళ్లి,

వినోదం పేరుతో విచ్చలవిడిగా

ప్రకృతి ఒడిని చెరిపేసి…

ప్రమాదాన్ని పిలిచింది మనమే..!

 

ఇది ట్రైలర్ మాత్రమేనని

ప్రకృతి చెబుతున్నా…

చెవిటివారిలా నటిస్తూ

చోద్యం చూస్తున్నది మనమే..!

 

హిమశిఖరాలు కరుగుతున్నాయంటే

హెచ్చరిక కాదా మనకు..?

 

ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా

కనీసం సోయి ఉందా మనకు..?

 

నేపాల్‌లో నేడు ప్రకృతి ప్రకంపన..!

రేపు మన వంతు ఈ విధ్వంస వేదన..!

 

అందుకే ఇకనైనా మేల్కొందాం…

మొక్కలను నాటుదాం…

అడవులను కాపాడుదాం…

హిమాన్ని కాపాడుదాం…

భావితరాలకు కానుకగా ఇద్దాం…

 

రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి

9347042218

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం .

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!